Real Incident: Adi Alaa Jarigindi... - written by Rawindar
ఇప్పుడు నేను చెప్పబోయే విషయం
రూం ఒకటే అయిన కాలేజీ లో క్లాస్సేస్ వేరు. నేనైతే అమ్మాయిలకి
బయపడి అమ్మాయిలు లేని గ్రూపులో జాయిన్ అయ్యాను . దాదాపు అందరం క్లాస్సేస్
కి వెళ్ళే టైం ఒకటే కాని రావటం వేరుగా వుండేది, ఎవరికీ ముందు అయిపోతే
వాళ్ళు ముందు వచ్చి వంట చెయ్యాలి . మా రూం మెయిన్ రోడ్ కి కాస్త దూరమే అని
చెప్పాలి , ఒకసారి బయటకి వేల్లోచక మల్లి వెళ్ళే సాహసం ఎవరం చేయలేము అల
వుండేది . ఎప్పుడైనా రూమ్లో వంట నేను లేకపోతే మా ఫ్రెండ్ కృష్ణ ఇద్దరిలో
ఎవరో ఒకరం చేసేవాళ్ళం .
అనుకోకుండా ఒక రోజు నాకు మా ఫ్రెండ్ కృష్ణ కి కాలేజీ లో
ప్రాక్టికల్స్ వుండటం వాళ్ళ చాల లేట్ అయింది రూం కి రావటానికి , అప్పటికే
మా కడుపులో యుద్ధం స్టార్ట్ అయిందని చెప్పొచు. కాని నాకు ఏ మాత్రం వంట చేసే ఓపిక లేదు చాల
హడావిడిగా కాలేజీ నుండి రూం కి వచ్చేసాం నేను మా ఫ్రెండ్ కృష్ణ . ఇంతలోనే
ఒక అద్బుతం మా ముందు జరిగింది . ఎప్పుడు వంట చేయని మా ఫ్రెండ్ వెంకి మా
ముందు వంట చేస్తూ కనపడ్డాడు . అప్పుడు నాలో నేనే పర్లేదు మనకి అదృష్టం
బాగానే వుంది అనుకున్న , కాని అది అదృష్టం కాదని ఒక పది నిముషాల్లోనే
తేలిపోయింది . ఎందుకంటార అసలు వాడు చేసే కూర ఏదో బెండకాయో/ దొండకాయో
అనుకున్నాం మేము , కూర అవ్వగానే వంట ముందు పెట్టుకొని చుట్టూ కూర్చున్నాం .
ఇప్పుడే స్టార్ట్ అయింది మేము తినటం . చెయ్యక చెయ్యక వంట చేసావు కదరా
నువ్వే వడ్డించర వెంకి అన్నాను నేను. దానికి వాడు ముసి ముసి నవ్వులు
నవ్వుతు వడ్డించటం మొదలెట్టాడు , అప్పటికి మా బుర్రలకి అర్థం కాలేదు ఆ
అద్బుతం , అయిన మేము చాల ఆకలి తో వున్నాం అవన్నీ పెద్దగ పట్టటం లేదు మాకు
.
తినటం మొదలు పెట్టాం , ఇప్పుడు అర్థమైంది వాడి నవ్వుకి
గల కారణం , అసలు అది కూరనే కాదు , రూం ముందున్న జామచెట్టు కాయలు అవి . అది
చూసాక వాణ్ణి తిట్టాలో కొట్టాలో లేక పొగడాలో అర్ధం కాని స్థితిలో మేమున్నాం
. వాడు మాత్రం విపరీతంగా నవ్వేసాడు , ఆ తరువాత మేము కూడా చేసేది ఏమి లేక
వాడితో పాటుగా శ్రుతి కలిపం హ...హ్హ.....హ్హ.......అంత అయిపోయాక ఏంట్రా ఇలా
చేసావ్ . ఏదైనా కూర చేస్తవనుకుంటే జామకాయ కూర ఏంట్రా అని అడిగితే వాడి
సమాదానం చూడండి. "మనం రోజు తినే కూరగాయలు మనకు ఎలా తెలుసు ర ఎవరో ఒకరు
ముందు చేస్తేనే కదా తెలిసింది , అలాగే జామకాయ ఎలా వుంటుందో అని ట్రై చేసార
". వాడి సమాధానానికి ఏమి చేయాలో తోచక నవ్వుకున్నాం ....
మా డిగ్రీ లైఫ్ లో వాడు మూడు సార్లు వంట చేసాడు దేనికదే
రికార్డు బ్రేఅక్ చేసాడు , ఇలానే ఇంకోసారి ఎం జరిగిందంటే ఆ రోజు రూమ్లో
ఆయిల్ అయిపాయింది , సమె ప్రాబ్లం బయటకి వెళ్ళాలంటే చాల దూరం ఎలా వచిందో
తెలిదు వాడికి ఐడియా రూమ్లో వున్నా పారాచూట్ ఆయిల్ పోసి వంట చేసాడు,
ఇంకోరోజు పోపులో కరివేపాకు బదులు రూం ముందున్న తులసి ఆకులు వేసి వంట చేసాడు
. వీన్ని ఇలానే ఉంచితే వరల్డ్ రికార్డ్స్ మొత్తం మన రూం నుండే నమోదు
అవుతాయి అని నేను మా ఫ్రెండ్ కృష్ణ కలిసి వాడిని వంట రూములో బాన్ చేసాం .
అప్పటి నుండి వాడి డ్యూటీ వంట పాత్రలు కడగటం వరకే. ఇలా చేసి గిన్నీస్
రికార్డ్స్ నమోదు చేసుకునే వారికి పని తగ్గించాం హ..హ్హ.....హ్హ..........
ఏది ఏమైనా చాల బాగా ఎంజాయ్ చేసాం మా డిగ్రీ రోజుల్ని . ఈ
విషయాన్నీ ఎప్పుడు వీలుంటే అప్పుడు గుర్తు చేసుకొని నవ్వుకుంటాం మా
ఫ్రెండ్స్ అందరం...
Written by Rawindar
nice world recods by ur frnd rawinder garu nice memory funny tooo enjoyed.........nice keepit up mee post lu and vatitho patu pics kooda chala bagunay nice......
ReplyDelete