కొత్త దంపతులను ఆశ్చర్య పరిచిన నమిత

కొత్త దంపతులతో నమిత
చెన్నై: పెళ్ళికి అందరూ రావాలని కోరుకుంటారు నూతన దంపతులు. అదే ఆ పెళ్లికి సినీ తారలు అనుకోని అతిథిలా వస్తే ? అలాంటిదే కరూర్ కి సమీప గ్రామంలో చోటు చేస్కుంది. కరూర్ లోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు నమిత శుక్రవారం చెన్నై నుంచి విమానంలో తిరుచ్చి చేరుకున్నారు. అక్కడనుంచి కారులో కరూర్ కి బయలు దేరారు. మార్గ మద్యలో ముక్కొంబు గ్రామంలో రోడ్డు పక్కనున్న ఓ ఆలయంలో వివాహం జరుగుతుండటం నమిత కంటపడింది. ఆమె కిందకి దిగి నేరుగా పెళ్ళి ఆవరణలోకి ప్రవేషించారు. తమ పెళ్ళికి సినీ తార రావడం అది కలా.. నిజమా.. అన్న సందిగ్దంలో పడిపోయారు ఆ నూతన జంట. కొత్త దంపతులకు శుభాకన్షలు చెప్పి నగదు బహుమతి అందజేశారు నమిత.

Comments