గల్ఫ్లో భారత మహిళా కార్మికుల దైన్యం

గల్ఫ్లో భారత మహిళా కార్మికుల దైన్యం - ఐరాసా నివేదికలో వెల్లడి.
కొత్తఢిల్లి: గల్ఫ్ కు వలస వెళ్ళిన దక్షిణాసియా మహిళా కార్మిక శక్తిలో భారత్ మూడో స్టానంలో ఉన్నప్పటికీ.. భారత మహిళా కార్మికులు మాత్రం అక్కడ దుర్బర పరిస్థితుల్లో గడఫాల్సి వస్తోందని ఐరాస్ నివేదిక ఒకటి వెల్లడించింది. పనిచేస్తున్న సమయంలో వారికి న్యాయం దక్కట్లేదని వివరించింది. 'మైగ్రేషన్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్ ఫ్రం సౌత్ ఆసియా టు గల్ఫ్ ' పేరుతో ఐరాస్ సోమవారం ఓ నివేదికను విడుదలచేసింది. పరిస్తితులు దోపిడీకి సహకరించేవిగా ఉన్నప్పటికీ దక్షిణాసియా నుంచి గల్ఫ్ కు వచే మహిళా కార్మికుల సంఖ్య పెరిగే అవజాశముందని అందులో వెల్లడించింది. "వలస చక్రంలోని పలుస్తాయిలో మహిళా కార్మికులు వివక్ష, దోపిడీకి గురవుతున్నారు. ఇది సొంతదేశాల్లోను, గల్ఫ్లోను ఉంది. భవిష్యత్తులోను ఈ దుస్తితి కొన్సాగొచ్చు" అని పేర్కొంది.భారత్ నుంచి వలస వెళ్లే కార్మికుల అర్హత విషయంలో కనీసం పదో తరగతి లేదా 30 ఏళ్లు పూర్తయ్యేలా నిభందనను తప్పనిసరి చేయాలని సూచించింది. గల్ఫ్ ప్రాంతానికి వచే భారతీయ మహిళా కార్మికుల్లో ఎక్కువ మంది సౌది అరేబియాకు వస్తున్నారని నివేదిక వివరించింది. గల్ఫ్ దేశాల్లో నియామక ప్రక్రియను కఫలా వ్యవస్థ ఆధారంగా చేపడుతున్నారని, దీని వల్ల ఒప్పందాలు వ్యక్తిగతంగా ఉండడతో పాటు.. మహిళా కార్మికులు తన యజమానిపై ఎక్కువగా ఆధారపడేలా ఉంటాయని వెల్లడించింది. సరైన అవగాహన లేకుండా ఒక్కరే వెళ్లే మహిళా కార్మికులు సరచూ దోపిడీ, పీడనలకు గురవడంతోపాటు.. ఏజెంట్లు, యజమానుల చేతిలో మోసగింపబడుతున్నారని నివేదిక పేర్కొంది.

Comments