About Manandari.In

మనంధరి.ఇన్ గురించి

     మనంధరి.ఇన్ ఇది మనందరి సైట్. మనకు నచ్చిన పాటలను మొదలుకుని మన జీవితంలో జరిగిన తీపి సంఘటనల దగ్గర నుండి చేదు సంఘటనల వరకు 'మనంధరి ' లో మనము పొందుపరుచవచ్చు, అంతె కాకుండా వాటిని మన మిత్రులకు, సన్నిహితులతో పంచుకునే వీలును కూడా కల్పిస్తోంది 'మనంధరి'. మనము సరదాగా రాసుకునే కథలను సైతం ఇక్కడ పోస్ట్ చేయవచ్చు.

'మనంధరి' గురించి మరింత సమాచారం :

  • మనందరికి తెలియని ఎన్నోఅద్భుతాలు ఈ భూ మండలం మీద అనేకం. వాటి గురించి నూటికి పది శాతం మందికి మాత్రమే తెలుసు అంటే తెలియని వారు తొంబై శాతం మంది ఉంటారు. అందుకే మనకు తెలిసిన విషయాలను అందరితో "తెలుసుకుందాం" అనే పేజీ ద్వారా పంచుకునే అవకాశం మనకు కల్పిస్తోంది మన "మనంధరి". ఈ పేజీ ముఖ్యోద్దేశ్యం తెలియని విషయాలు అందరికి తెలియాలనే సంకల్పంతో దీనిని ప్రారంభించడం జరిగింది.

  • గుమ్మాలకి పచ్చని తోరణాలు, పూజగదిలో నుండి అగరత్తుల సువాసన అనగానే ఠక్కున గుర్తొచ్చేది పండగ. పండగ అనగానే తెలియని ఆనందభక్తిభావాల్లోకి వెళ్ళిపోతాం. పూజలు, ఉపవాసాలు, పిండివంటలు చేసుకుంటాం అంతా సవ్యంగానే చేస్తాము కాని ఆ పండగ ఎలా ప్రారంభమయింది ? ఎందుకు జరుపుకుంటున్నాము ? ఇలాంటివన్ని మనందరికి తెలియడాని కోసం "మన పండగలు" పేజీ ప్రారంభమయింది. 

  • కుట్రలు కుతంత్రాలు, వెన్నుపోటు, పక్కలో బళ్ళెం, మాటమీద నిలబడని నాలుక వీటన్నిటికి అసలు పేరే రాజకీయం. రాజకీయం అంటేనే కొందరికి చెలగాటం, అదో చెదరంగం. రాజకీయం పై చర్చ, సమాచారం "రాజకీయం" పేజీలో పొందవచ్చు. ఇది మరికొద్ది రోజుల్లోనే పూర్తి హంగులతో మీ ముందుకు వస్తోంది.

  • సినీ ప్రపంచం అంటేనే ఒక అందమయిన ప్రపంచం. అదో హరివిల్లు, రంగుల రాట్నం. వెండితెర మీద కనిపించే తారలు వారి నిజజీవితంలోని సంగతులు, విశేషాలు మరియు సినిమాల మీద అభిప్రాయం "సినీ ప్రపంచం"లో పొందవచ్చు మరియు సినిమాల వివరాలు రివ్యూ సైతం ఇందులో పొందుపరచడం జరుగుతుంది. ఈ పేజీ మే నెల ఆఖరున ప్రారంభంకానుంది.

  • మర్యాదలను ఇచ్చిపుచ్చుకుంటూ సరదా మాటలతో, కబుర్లతో కాలక్షేపం చేయడానికి టి.ఎల్.సి. ని పెట్టడం జరిగింది.
  ఈ వెబ్ సైట్ ఆవిర్భవానికి గల కారణం:

     ఈ సైట్ ను ప్రారంభించడానికి గల ముఖ్యోద్దేశ్యం గౌరవం, మర్యాద, మంచితనం కోరుకునే వారందరిని ఒకే చోట చేర్చి, వారందరు మాట్లాడుకునే విదంగా ఈ సైట్ లోని చాట్ రూం ను ప్రథమంగా ప్రారంభించడం జరిగింది. తరువాత యూజర్స్ దృష్ఠ్యా మరియు వారి సలహాల మేరకు మిగతా పేజీలను ప్రారంభించి వాటిని అభివౄద్ది చేయడం జరుగుతుంది.


     మీ విలువైన సలహాలను, సూచనలను ఎప్పటికప్పుడు మా ఈ-మెయిల్ కి పంపుతూ మన అందరి సైట్ "మనంధరి.ఇన్" అభివౄద్దికి తోడ్పడగలరని మనవి.
e-mail : support@manandari.in

Comments