అంటార్కిటికాలో మూడో పరిశొధనా కేంద్రం !!

అంటార్కిటికాలో మూడో పరిశొధనా కేంద్రం !!
పనాజి (TLC): దాదాపు 28 సంవత్సరాల తర్వాత దక్షిణ ధ్రువ ప్రాంతం (అంటార్కిటికా) లో ఏర్పాటూ చేయబోతున్న శాశ్వత పరిశొధన కేంద్రం పనులను భారత్ వేగవంతం చేసింది. 'భారతీ అని నామకరణం చేసిన ఈ కేంద్రాన్ని 2012 మార్చిలో ప్రారంభించనుంది. ఇంతకుముందు భారత్ ఇక్కడ 1983లో 'దక్షిణ గంగోత్రీ, 1988-89 లో 'మైత్రీ అనే పరిశొధనా కేంద్రాలను నెలకొల్పింది. నూతన కేంద్రాన్ని మైత్రి నుంచి 3,000 కిలో మీటర్ల దూరంలో ఏర్పాటు చెస్తున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ అంటర్కిటిక్ అండ్ ఓసియన్ రిసెర్చ్ (ఎన్సీఏఓఆర్) డైరెటర్ రసిక్ రవీంద్రా పేర్కొన్నారు. " ఈ కొత్త కేంద్రం ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నయి. అక్టొబర్ 26న్ కేప్టెన్ నుంచి రాజెష్ ఆస్తానా నేత్రుత్వంలొ అంటర్కిటీక్ కు చెరుకున్న బ్రుందం మార్చి 2012 వరకు కేంద్ర ప్రాజెక్టు పనులు పూర్తి చెయనుంది" అని వివరించారు. ఎన్సీఏఓఆర్ పరిశొధకులు అంటార్కిటికాలో సమగ్రమైన్ పర్యావరణ మూల్యాంకణం జరిపి దక్షిణ ద్రువానికి తూర్పువైపున గల లార్సేమాన్ హిల్స్ పై గల ప్రాంతాన్ని కేంద్రం ఏర్పాటు చేయడానికి ఎంపిక చెసినట్లు తెలిపారు. ఈ కేంద్రం 25ఏళు పని చేసే విధంగా రెండు అంతస్తుల నిర్మాణం చెపట్టినత్లు తెలిపారు. ఈ కేంద్రం నిర్మాణం పూర్తయిన తర్వాత భారత పరిశొధకులు ఇక్కడ భౌగోలిక స్వరూపం, భూ అంతర్భాగంపై పరిశొధనలు కొనసాగిస్తారని వెల్లడించారు.

Comments