ఇక మన నలుపు కళ్ళ రంగు మార్చుకొవచు !!

ఇక మన నలుపు కళ్ళ రంగు మార్చుకొవచు !!
లండన్ (TLC): మీ నలుపు రంగు కళ్ళ రంగు మారచుకోవాలనుకుంటున్నరా ??? అయితే త్వరలోనె మీ కల నెరవెరబోతోంది. అమెరికాకు చెందిన డాక్టర్ గ్రెగ్ హోమర్ గోధుమ రంగు కళ్లను నీలి రంగులోకి మార్చే ఓ లేసర్ చికిత్స పద్దతిని కనుగొన్నారు. తాను రూపొందించిన నూతన చికిత్సా పద్దతిలో 20 సెకండ్ల పాటు లేజర్ కాంతిలో కళ్లను ఉంచినపుడు కంటిలోని వర్నకం (పిగ్మెంట్) తొలగిపోయి అనంతరం నీలి రంగులోకి మారిపోతాయని వెల్లడించారు. ఒక్క నీలి రంగే కాక వీటి స్తానంలో వేరే రంగుల లెన్స్ లను కూడా అమర్చుకునే విధానాన్ని రుపొందించెందుకు ప్రస్తుతం తాను పరిశొధనా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ పరిశొధనకు సంబందించిన పరీక్షలు 18నెలల్లో పూర్తవనున్నట్లు పెర్కొన్నారు. qయితే కళ్లలోకి లేజర్ కాంథిని పంపడం వల్ల శాశ్వత కంటీ సమస్యలు తలెత్తె అవకాశం ఉందని కంటి నిపుణులు హెచరిస్తున్నారు. ఈ వివరాలను 'బీబీసీ' పేర్కొంది.

Comments