కాలగర్బం లోకి జీఎంటీ ?

కాలగర్బం లోకి జీఎంటీ ?
లండన్ (TLC) :సమయం తెలుసుకోవడానికి ఇప్పటివరకు అంతర్జాతీయ ప్రమాణంగా నిలిచిన గ్రీన్ విచ్ మీన్ టైం (జీఎంటీ) ఇక కాలగర్బం లో కలసిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటొంది. జీఎంటి పక్కనబెట్టి కొత్త పద్దతిలో సమయాన్ని నిర్దారించే ప్రతిపాదనపై చర్చించడానికి ప్రపంచవ్యప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రవెత్తలు గురువారం బ్రిటన్ లో సమావెశమయ్యారు. రాయల్ సొసైటీ ఆద్వర్యంలో వాయువ్య లండన్ లో రెండు రోజుల పాటు జరిగే ఏ భేటీళ్లో 50 ప్రముఖ శాస్త్రవెత్తలు పాల్గొంటున్నారు. భు పరిబ్రమణం ఆధారంగా జీఎంటి సమయాన్ని కొలుస్తుండఘా, అణు గడియారం (అటామిక్ క్లాక్) ఆధారంగా సమయాన్ని నిర్దారించాలన్నది కొత్త ప్రతిపాదనను ఆమోదించాలా ? వద్దా అనే విషయంలో 2012, జనవరిలో జెనీవాలో అంతర్జాతీయ టెలీకమ్యునికేషన్ యూనియన్ సమావేషమయి ఓ నిర్నయం తీసుకోనుంది. కాగా, జీఎంటీ ని పక్కనబెట్టే నిర్ణయాన్ని బ్రిటన్ తీవ్రంగా ఖండీస్తోంది. తమ పాత శత్రువు ఫ్రాన్స్ యే జీఎంటీ ని పక్కనబెట్టి, కొత్త టైం ప్రమాణాలను రూపొందించాలని పట్టుబడుతోందని అనుమానిస్తోంది.

Comments