'సత్యమేవ జయతే' పై అమీర్ క్షమాపణలు చెప్పాలన్న ఐ ఎం ఏ

'సత్యమేవ జయతే' పై అమీర్ క్షమాపణలు చెప్పాలన్న ఐ ఎం ఏ 

కొత్తఢిల్లి: వైద్య వ్రుత్తిని కించపరిచినందుకు బాలివుడ్ నటుడు అమీర్ ఖాన్ క్షామపణలు చెప్పాలని భారత వైద్య సంఘం (ఐ ఎం ఏ) డిమాండ్ చేసింది. మే 27 న ప్రసారమైన 'సత్యమేవ జయతే' టీవీ కార్యక్రమంలో వైద్యవృత్తిపై ఏకపక్షంగా ఇచ్చిన కథనంపై క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో న్యాయపరమైన్ చర్యలు తీసుకుంటామని ఐ ఎం ఏ ప్రధాన కార్యదర్షి డా|| డీ.ఆర్.రాయ్ పేర్కొన్నారు. ఆరోగ్యం రంగం పై 'సత్యమేవ జయతే' కార్యక్రమంలో వెలువరించిన అభిప్రాయాలపై వైద్యులు దృక్కోణాన్ని పాత్రికేయసమావెషంలో వివరించారు. ప్రతి వృత్తిలోను లొసుగులు ఉంటాయని, అమీర్ ఖాన్ పనిచేస్తున్న చిత్రపరిష్రమలోనే ఎన్నో వ్యవాహారలపై అప్పుడప్పుడు వార్తలు వెలువడుటుంటాయని చెప్పారు. ఒక బాద్యతాయుతమైన్ పౌరుడిగా, దేశంలో చాలా మంది ఆరదించే వ్యక్తి ఇలంటి చర్యలకు పాల్పడటం సబబు కాదన్నారు. సమస్యకు రెండు పార్ష్వాలు చూపించడానికి బదులుగా, అమీర్ ఖాన్ తన టీవీ కార్యక్రమానికి టీఆర్ఫీ రేటీంగ్లు పెంచుకోడానికే ఇలాంటీ చర్యలకు పాల్పడ్డరని విమర్షించారు. అరుదుగ చోటు చేసుకునే కొన్ని కేసులను రోజు జరిగే వ్యవహారంలా ఒకే పార్ష్వంతో చిత్రీకరించడం నిర్మాణాత్మక జర్నలిజం నైతిక స్పూర్తికే విరుద్దమన్నారు. మే 27 నాటి సత్యమేవజయతే కార్యక్రమంలో దేషవ్యప్తంగా వైద్యరంగంలో చోటుచేసుకుంటున్న అవకతవకల్ని ఎత్తి చూపారు.

Comments